మహిళలూ టీనేజ్ పిల్లలకు ప్రయారిటీ ఇవ్వండి!

సోమవారం, 15 డిశెంబరు 2014 (18:12 IST)
మహిళలూ టీనేజ్ పిల్లలకు ప్రయారిటీ ఇవ్వండి అంటున్నారు సైకాలజిస్టులు. మీరు టీనేజ్ పిల్లలకు తల్లులైతే.. వారి ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. మానసిక నిపుణులు.

లొడలొడా వాగే కొడుకు మీ ప్రశ్నలకు అవును, కాదు అని సింపుల్‌గా సమాధానం చెప్పేసి వెళ్లిపోతే నొచ్చుకోకండి. సరుకులు తేవటానికి షాపుదాకా తోడు రావటానికి కూతురు కుంటి సాకులు చెబితే బాధపడకండి. ఇలాంటి ప్రవర్తనను బట్టి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్న భావనకు గురికాకండి. 
 
టీనేజ్‌లో అడుగుపెట్టినంత మాత్రాన పిల్లలకు మీ మీద ప్రేమ ఏమాత్రం తరిగిపోదని గమనించండి. కాకపోతే.. పూర్వం ఆనందాన్నిచ్చిన అవే పనులు టీనేజ్ పిల్లలకు బోర్ కొట్టేస్తాయి. టీనేజర్ల ఆనందం స్థాయిలు, ఆనందాన్నిచ్చే అంశాలు మారిపోతాయంతే.! వాటికి తగ్గట్టు పారెంట్స్ తమను తాము మార్చుకుంటూ వారికి రక్షణ వలయంలా ఉండాలని మానసిక నిపుణులు సెలవిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి