అప్పుడప్పుడు ఒత్తిడికి లోనవుతున్నారా? అయితే జాగ్రత్త పడండి. ఒత్తిడిలోనైతే అనేక సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు విడుదలయ్యే హార్మోనులు బ్లడ్ ప్రెజర్‌ను పెంచడం మాత్రమే కాదు, హార్ట్ రేటును కూడా పెంచుతుంది. కండరాలు మరింత బిగుపడేలా చేస్తుంది. కూర్చునేటప్పుడు సరైన భంగిమలో కూర్చోకోకపోవడం వల్ల కూడా ఒత్తిడి మరింత పెరుగుతుంది.
కనురెప్పలు కొట్టుకోవడానికి ఒత్తిడికి దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడైనా మీ కనురెప్పలు కొట్టుకోవడం జరిగితే, వెంటనే మీ కన్నులను మూసుకొని, మీ మనస్సులో ఎటువంటి ఆలోచనలు రాకుండా, ఒక లోతైన శ్వాస తీసుకొని నిధానంగా వదలాలి. తర్వాత రిలాక్స్అవ్వాలి. ఇలా కొన్ని సార్లు చేస్తుండాలి. తర్వాత మీ కనురెప్పలు కొట్టుకోవడం తాత్కాలికంగా నిలుస్తుంది
క్రోనిక్ స్ట్రెస్ వల్ల మొటిమలకు కారణం అవుతుంది. ఆడ్రోజన్స్ అధికంగా విడుదల అవ్వడం వల్ల మొటిమలకు దారితీస్తుంది. ఇంకా ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు హీలింగ్ ఎబిలిటీ కూడా తగ్గడంవల్ల మొటిమలు అంత త్వరగా పోవని, టెన్షన్ పడితే తప్పకుండా పొట్ట కూడా వచ్చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.