గర్భవతులు ఆఫీసులో ఎలా కూర్చుంటున్నారు?

శనివారం, 17 జనవరి 2015 (16:29 IST)
ఆఫీసులో గర్భవతులు ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది. అలా మీరు కూర్చునే స్థలంలో అసౌకర్యంగా ఉంటే.. అలా కూర్చోకూడదు. సులభంగా, సౌకర్యవంతగా కూర్చోవడం అలవాటుచేసుకోండి. వెన్నెముక, మెడకు సౌకర్యవంతంగా ఉండేలా దిండును పెట్టుకోండి గర్భంతో ఉన్నారు కావడంతో కూర్చొనే సీటు చాలా సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.
 
పౌష్టికాహారంపై దృష్టి పెట్టాలి. ఎక్కువ నీటి శాతాన్ని కలిగి ఉండే సలాడ్, పండ్లు వంటి వాటిని తినండి. మీ శరీరాన్ని హైడ్రేటేడ్'గా ఉంచుకోవటం వలన వాంతులు కలిగే అవకాశం ఉండదు.
 
కాఫీలోని కెఫిన్‌, కెఫినేటెడ్ డ్రింక్స్ మొదటి మూడు మాసాలలో ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకి 200 మి.గ్రా. కంటే ఎక్కువ తీసుకుంటే గర్భస్రావము జరిగే ప్రమాదము ఉంది. కెఫిన్‌ డైయూరిటిక్‌గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి