మహిళల్లో ప్రసవం తర్వాత శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాదు మెదడు మీద కూడా కొత్త ఒత్తిడికి దారితీస్తుంది. ప్రసవం తర్వాత బరువు, శక్తి కోల్పవడం మనస్సులో ఒక స్థిరమైన ఒత్తిడి పెరిగిపోతోంది. శరీరంలో మార్పులు తేవాలంటే తగినంత శక్తి, వ్యాయామం చాలా అవసరం. ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ కొన్ని నెలల పాటు లేదా ఒక సంవత్సరం వరకూ ఉండవచ్చు.
ఈ పోస్ట్ నేటల్ డిప్రెషన్ తగ్గించుకోవడానికి కొంత కష్టం అవుతుంది. అందుకు కొంత విశ్రాంతి తీసుకోవడం మరియు రిలాక్స్‌గా ఉండటం చాలా అవసరం. పోస్ట్ నేటలర్ డిప్రెషన్ తగ్గించుకోవాలంటే మీరు హెల్తీ అండ్ న్యూట్రీషియన్ డైట్ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే శిశువుకు పాలు పట్టే తల్లిలో అనేక హార్మోనుల మార్పులు జరుగుతాయి . కాబట్టి శరీరంను సమతుల్యం చేసే పోషకాహారన్ని తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన మనస్సుతో ఉండవచ్చు.
ప్రసవం తర్వాత ఒత్తిడికి ప్రధాన కరాణం నిద్రలేమి కూడా ఒకటి. కాబట్టి, ప్రసవం తర్వాత తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం. కాబట్టి, శిశువు నిద్రించేటప్పుడు తల్లికూడా నిద్రపోయి, తగిన విశ్రాంతి తీసుకోవాలి. మీ మనస్సును ప్రశాంత పరచుకోవడానికి ఉపాయం వెతకండి. మీకు అత్యంత ఇష్టమైన పనులను చేయడానికి ప్రయత్నించండి. ఇది ఒక ప్రభావంతమైనదిగా పనిచేస్తుంది. ఎక్కువ సమయం మీ బేబీతో గడపడానికి ప్రయత్నించండి. దాంతో డిప్రెషన్ మరియు స్ట్రెస్‌ను తగ్గించుకోవడానికి సహాపడుతుంది.
ప్రసవం తర్వాత మీ బరువును తగ్గించుకోదలచుకొన్నప్పుడు. మీరు యోగా క్లాస్సుల్లో చేరడం బెటర్. ఇది మీరు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. చాలా మంది మహిళలు ప్రసవం తర్వాత వారి మీద శ్రద్ధ ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి, వ్యక్తిగతంగా అందం, ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ తీసుకోవడం మంచిది.