వాల్ నట్స్ స్పెషల్: టెన్షన్‌ను తగ్గించుకోవాలంటే?

బుధవారం, 11 ఫిబ్రవరి 2015 (15:32 IST)
ఒత్తిడిని తగ్గించుకోవాలంటే వాల్ నట్స్‌ను రోజువారీ డైట్‌లో తప్పకుండా చేర్చుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాల్ నట్‌ మంచి ప్రశాంతతను ఇస్తుంది. ఇందులోని విటమిన్ బి, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటంతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
ఇంకా డిప్రెషన్‌ను నివారిస్తుంది. అలసట, ఆందోళన, నిద్రలేమి సమస్యలను కూడా నివారిస్తుంది. కాబట్టి, రోజువారీ రెగ్యులర్ డైట్‌లో వాల్ నట్స్‌ను చేర్చుకోవడం ద్వారా టెన్షన్ లేకుండా మంచి నిద్రను పొందవచ్చు. 
 
నిద్రలేమి ద్వారా కలిగి కంటికింద వలయాలు, ముడతలు, బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాలంటే.. వాల్ నట్స్ తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి