వాషింగ్ మిషన్‌లో వేసే బట్టలు ముడతలు పడకుండా ఉండాలంటే?

మంగళవారం, 19 మే 2015 (12:36 IST)
వాషింగ్ మిషన్‌లో వేసే బట్టలు ముడతలు పడకుండా ఉండాలంటే? ఈ టిప్ ఫాలో కండి. నిత్యమూ బట్టలు వాషింగ్ మిషన్‌లో ఉతకడం, ఆపై డ్రయ్యర్లో వేసి ఆరబెట్టడం.. దీంతో ముడతలు పడ్డ బట్టలు తీసి ఐరన్ చేయడం వంటి పనుల్లో ఇబ్బంది పడిపోతున్నారా.. అయితే ఉతికిన బట్టలకు ముడతలు లేకుండా చూసేందుకు ఓ మహిళ సూపర్ చిట్కాను కనుగొంది. అది చాలా సింపుల్. 
 
బట్టలు ఉతికిన తరువాత డ్రయ్యర్‌లో ఆరబెట్టే ముందు రెండంటే రెండు ఐస్ క్యూబ్‌లు అందులో వేస్తే చాలు. అదేంటి డ్రయ్యర్‌లో ఐసు ముక్కలేస్తే బట్టలకు ముడతలు ఎలా పోతాయని అనుకుంటున్నారా? డ్రయ్యర్ పనిచేసే సమయంలో వెలువడే వేడికి బట్టల్లో వేసిన ఐసు ముక్కలు తొలుత నీటిగా, ఆపై నీటి ఆవిరిగా మారుతుంది. దీంతో బట్టలకు ఆవిరి పట్టి ముడతలన్నీ పోతాయి. ఇస్త్రీ చేసినట్టుండే దుస్తులు సిద్ధమవుతాయి. అయితే, మంచి ఫలితాల కోసం డ్రయ్యర్‌ను గరిష్ఠ ఉష్ణోగ్రతపై ఉంచాలని మాత్రం మరవద్దు.

వెబ్దునియా పై చదవండి