స్విమ్మింగ్, డ్యాన్సింగ్, పెయింటింగ్, కుకింగ్, రీడింగ్ వంటి ఏ వ్యక్తిగత హాబీని అలవరుటుకున్నా శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండగలరు. వాకింగ్ చక్కని ఎక్సర్‌సైజ్. ప్రతిరోజూ అందంగా, మంచి ఫీలింగ్స్‌తో ఉండేందుకు క్రమంతప్పని అందాల పరిరక్షణను అనుసరించాలి. మనస్సును రీఛార్జ్ చేసుకుని, హుషారుగా ఉండేందుకు అనువుగా రోజులో కొద్దిసేపు సంగీతాన్ని ఆస్వాదించేలా ఏర్పాటు చేసుకుంటే మనశ్శాంతి మీ సొంతం అవుతుంది.
నెలరోజుల్లో ఇరుగుపొరుగున వారితో సత్సంబంధాలు అవసరం. ఆసక్తిదాయక అంశాల్ని షేర్ చేసుకోండి. ఒకసారి వార్డ్ రోబ్‌ను సక్రమంగా సర్దుకుంటూ ఉంటే అనవసరమైనవి అడ్డురావు. తాజా ప్రాపంచిక విషయాల్ని తెలుసుకుంటూ ఉండాలి. వీటివల్ల నలుగురి మాటల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. వ్యక్తిగత సమయాన్ని ప్రతిరోజూ అందుబాటులో ఉంచుకోవాలి.