స్త్రీకి 30 ఏళ్లు దాటితే ఆ ఛాన్స్ జారిపోతున్నట్లే...

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (20:25 IST)
స్త్రీల గర్భ ధారణకు అనువైన వయసు 24 నుంచి 30 ఏళ్లని వైద్యులు చెప్తుంటారు. ఐతే 35 ఏళ్ల వరకూ గర్భం దాల్చే వీలున్నప్పటికీ 30వ సంవత్సరంలో పెళ్లయితే ఆరు నెలల లోపే గర్భం దాల్చే ప్రయత్నం చేయాలి. ఒకవేళ 30 ఏళ్ల వయసులో పెళ్లై ఆరు నెలలు దాటినా గర్భం దాల్చకపోతే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. అంతకంటే ముందు పెళ్లయితే సాధ్యమైనంత త్వరగా పిల్లల్ని కనే ప్రయత్నం చేయడం మంచిది. 
 
చదువు, కెరీర్ పరంగా గర్భ ధారణను వాయిదా వేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల గర్భం దాల్చే అవకాశాలను చేతులారా పాడుచేసుకుంటారు. పూర్వం 35, 40 ఏళ్ల వయసులో కూడా పండంటి బిడ్డను ప్రసవించగలిగేవాళ్లు. కానీ కాలక్రమేణా పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల గర్భం దాల్చే అవకాశాలు సన్నగిల్లటం మొదలుపెట్టాయి. 
 
30 దాటిన తర్వాత గర్భం దాల్చగలిగినా పుట్టే పిల్లల్లో అవసరాలు ఏర్పడే ప్రమాదం వుంది. కాబట్టి ఆ వయసులోగానే పిల్లల్ని కనే ప్రయత్నం చేయడం మేలు. పురుషుల్లో కూడా 35 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత నుంచి వీర్య కణాల నాణ్యత తగ్గుతూ పోతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు