ఉద్యోగినులకు ఆఫీసు, ఇంటి పనులతో అద్దంలో చూసుకునే తీరికే ఉండదు. ఇక అందం గురించి ఆలోచించే తీరిక ఎక్కడిది? అయితే వాస్తవానికి పనిచేసే ప్రదేశంలో హుందాగా కనిపించడం కోసం ఉద్యోగినులు తప్పనిసరిగా కొన్ని సౌందర్య చిట్కాలు పాటించాలి. వాటిలో కేశాల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అవేంటో చూద్దాం..
అలాగే ఉద్యోగినులు రబ్బర్ బ్యాండ్స్ ధరించవద్దు. రబ్బర్ బ్యాండ్‌తో వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటాయి. కాబట్టి వీటిని వాడకపోవటమే మేలు. ఇక హెడ్ బ్యాండ్ ధరించవచ్చు. జుట్టు గాలికి ఎగిరి చిక్కు పడకుండా తలకు హెడ్ బ్యాండ్ ధరించాలి. పగటిపూట పువ్వులున్నది, రాత్రి వేళ మెటాలిక్ హెడ్ బ్యాండ్స్ ఆకర్షణీయంగా ఉంటుంది.