బ్యూటీ పార్లర్‌కు వెళుతున్నారా: ఐతే ఇవి తెలుసుకోండి
మంగళవారం, 25 మే 2010 (16:24 IST)
ND
నేడు మహిళలు చాలామంది తమ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకునేందుకు బ్యూటీ పార్లర్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే బ్యూటీ పార్లర్‌కు వెళ్ళాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు.
* బ్యూటీ పార్లర్లో ఏదైనా కాస్మోటిక్ పదార్థాన్ని మీ చర్మానికి ఉపయోగించేటప్పుడు అందులో ఏదైనా హానికరమైన రసాయనాలున్నాయేమో ఓసారి పరిశీలించి చూడండి. వాటిని వాడే ముందు ఎక్స్పైరీ డేట్ తదితర వివరాలను అడిగి మరీ తెలుసుకోండి.
* పార్లర్లో ఉపయోగించే తువాలు, దువ్వెన తదితర వస్తు సామగ్రిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచండి.
* మీరు వెళ్ళే పార్లర్ నిర్వాహకులు శుభ్రతపాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని గమనించండి. సౌందర్యంతోపాటు మీ ఆరోగ్యాన్ని దృష్టిలోవుంచుకుని మీరు వెళ్ళే బ్యూటీ పార్లర్ నిర్వాహకులు అనుభవజ్ఞులైన బ్యూటీషియన్లేనా అనేది పూర్తిగా తెలుసుకుని మరీ వెళ్ళండి. డబ్బు తక్కువ తీసుకుంటారని మిమ్మల్ని ఎక్కడబడితే అక్కడున్న బ్యూటీ పార్లర్లకు వెళ్ళకండి.
* మీకు ఎలాంటి అలర్జీ లేదా ఇతర చర్మ వ్యాధులుంటే ప్రత్యేకంగా మీరు వాడే తువాలు, దువ్వెన తదితర వస్తువులను మీవెంట తీసుకువెళ్ళండి. లేదా ప్రత్యేకంగా మీ వస్తువులనే బ్యూటీ పార్లర్‌కు తీసుకువెళ్ళి వాటితోనే మీ ముఖారవిందాన్ని మరింతగా ఇనుమడింపజేసుకునేందుకు ప్రయత్నించండి.