20ఏళ్ల మహిళ బెక్కీ జోన్స్‌కు లంగ్ ట్రాన్స్‌ప్లంట్ సక్సెస్..!
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా లంగ్ ట్రాన్స్‌ప్లంట్ విజయవంతమైంది. బ్రిటీష్ వైద్యులు ఈ శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. రెండు ఫంగల్ కండిషన్స్‌తో బాధపడుతూ వచ్చిన 20 ఏళ్ల మహిళ కు తొలిసారిగా చేసిన లంగ్ ట్రాన్స్‌ప్లంట్ ఆపరేషన్‌ను యూనివర్శిటీ హాస్పిటల్ ఆఫ్ సౌత్ మాంచెస్టర్‌కు చెందిన వైద్య బృందం నిర్వహించింది.
యాస్పర్జిలోసిస్ సెంటర్లో బెకీ జోన్స్ అనే 20 ఏళ్ల మహిళకు పాత లంగ్స్‌ను తొలగించి కొత్తవి జత చేసినట్లు డైలీ మెయిల్ తెలిపింది. ప్రస్తుతం జోన్స్ శ్వాస ప్రక్రియ నిలకడగా కొనసాగుతుందని వైద్యులు చెప్పినట్లు డైలీ మెయిల్ రిపోర్ట్ వెల్లడించింది.
ఇంకా చెప్పాలంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడిన జోన్స్ శరీరంలో యాంటీ ఫంగల్స్ సంఖ్య మెరుగ్గా ఉన్నాయని డైరక్టర్ ఆఫ్ నేషనల్ యాస్పర్జిలోసిస్ సెంటర్, ప్రొఫెసర్ డేవిడ్ డెన్నింగ్ పేర్కొన్నట్లు బ్రిటీష్ న్యూస్ పేపర్ డైలీ మెయిల్ కొటేషన్లలో తెలిపింది.