చలికాలంలో చర్మ సంరక్షణకు కొన్ని చిట్కాలు పాటించండి. చర్మం పొడిబారినట్లైతే ముఖ్యంగా పంచదార, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేసిన తరువాత ముఖాన్ని మర్దన చేసుకుని అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే ముఖచర్మం అందంగా తయారవుతుంది.
5. అలోవేరా ఆకులు తీసుకుని నలిపి, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసి రాసుకుంటే చర్మం మృదువుగా మారి మెరిసిపోతుంది. ఆలివ్ ఆయిల్ మసాజ్ వలన ఫలితం కనిపిస్తుంది. రెండు స్పూన్ల తేనె స్పూన్ నిమ్మరసం కలిపి చర్మంపై రాసుకోవాలి. ఇలా చేసి చూడండి మీలో తేడా కనిపిస్తుంది.