తేనె, నారింజ రసం మోచేతులకు రాసుకుంటే..?

గురువారం, 20 డిశెంబరు 2018 (13:30 IST)
తేనె ఆరోగ్యానికి మంచి టానిక్‌లా పనిచేస్తుంది. దీనిలోని న్యూట్రియన్ ఫాక్ట్స్ అందానికి మంచిగా దోహదపడుతాయి. ఇప్పటి చలికాలంలో అందరికి ముఖాలు పొడిబారినట్టు, జిడ్డు జిడ్డుగా ఉన్నాయి. వీటిని తొలగించడానికి బయటదొరికే పదార్థాలు వాడుతున్నారు. కానీ, ఎలాంటి ఫలితాలు కనిపించలేదు.. ముందు కంటే.. సమస్య మరింత దారుణమైపోయిందని బాధపడుతున్నారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
 
1. రెండు స్పూన్ల తేనెలో పావుకప్పు దాల్చిన చెక్క పొడి కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే చర్మం కాంతివంతంగా, తాజాగా మారుతుంది.
 
2. చాలామంది చలి కారణంగా నోటి దుర్వాసన అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు.. నిమ్మరసంలో స్పూన దాల్చిన చెక్క పొడి కొద్దిగా తేనె, నీరు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు ఓవెన్ పెట్టాలి. ఆపై దీనిని నోట్లో పోసుకుని నిమిషాలు పుక్కిళించాలి. ఇలా చేస్తే నోటి దుర్వాసన పోతుంది.
 
3. తేనెలో రెండు స్పూన్ల నారింజ పండు రసం కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మోచేతులకు పట్టించాలి. 45 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత మెత్తని బట్టతో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే.. గరుకుగా ఉన్న మోచేతులు కాస్త మృదువుగా తయారవుతాయి.
 
4. ఆలివ్ నూనెలో కప్పు తేనె కొద్దిగా స్నానపు జెల్, స్పూన్ వెన్లిలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని 20 నిమిషాల తరువాత స్నానం చేస్తే చర్మ దురదలు పోతాయి. 
 
5. రెండు గుడ్లను పగలగొట్టి తెల్లసొనను మాత్రం తీసి అందులో స్పూన్ తేనె వేసి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ముక్కుకు రాసుకుని దానిపై టిష్యూ పేపర్‌ను పెట్టాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే.. ముక్కుపై గల నల్లటి ఛారలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు