గంధాన్ని ముఖానికి పట్టిస్తే..?

గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:31 IST)
చర్మ సౌందర్యానికి గంధం ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. గంధాన్ని అరగదీసి కళ్ళమీద రాసుకుంటే కళ్ళ ఎరుపు మంటలు తగ్గుతాయి. చందనంతో తయారైన సోపులు, పౌడర్లు వాడితే చర్మానికి మంచిది. ఇంకా స్నానం చేసే నీళ్ళల్లో గంధం నూనె 5 లేదా 6 చుక్కలు వేసుకుని స్నానం చేస్తే వ్యాధులు రావు. శరీరం తాజాగా ఉంటుంది. చందనాది తైలం వలన తలనొప్పి కళ్ళమంటలు తగ్గుతాయి. 
 
గంధాన్ని అరగదీసి అందులో కొద్దిగా పసుపు, రోజ్‌వాటర్ చేర్చుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఆపై అరగంటపాటు అలానే ఉండాలి. తరువాత గోరువెచ్చని నీటితో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే.. ముడతలు చర్మం ఉండదు. 
 
ఆలివ్ ఆయిల్‌లో గంధం కలిపి చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది. గాయాలకు చందనం పూస్తే వెంటనే మానిపోతాయి. గంధం చర్మానికి యాంటీ సెప్టిక్‌లా పనిచేస్తుంది. గంధాన్ని అరగదీసి రోజూ రెండుసార్లు ముఖానికి రాసుకుంటే మొటిమలు పోతాయి. ఇలా క్రమంగా చేయడం వలన చర్మం నున్నంగా తయారవుతుంది. గంధంలోని యాంటీ ఫంగల్ గుణాలు చర్మానికి మంచి ప్యాక్‌లా ఉపయోగపడుతాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు