తడిజుట్టుతోనే బ్యాండ్‌లు వేస్తున్నారా.. జుట్టు పెళుసుగా..?

బుధవారం, 26 సెప్టెంబరు 2018 (17:24 IST)
చాలామంది వారానికి రెండుమూడుసార్లు తలస్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వలన జుట్టు పొడిబారినట్లవుతుంది. దీంతో వెంట్రుకలు ఎక్కువగా రాలుతాయి. తలస్నానం చేసిన తరువాత ఈ క్రింది జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. తలస్నానం చేసిన తరువాత టవల్‌తో జుట్టును బాగా తుడుచుకోవాలి. 
 
తలస్నానం చేసిన తరువాత జుట్టుకు కండీషనర్ వాడాలి. దీంతో జుట్టు పొడిబారకుండా కాంతివంతంగా మారుతుంది. తడిజుట్టును దువ్వెనతో దువ్వడం వలన కూడా వెంట్రుకలు అధికంగా రాలిపోతాయి. తలస్నానం చేసిన తరువాత వేళ్లతోనే చిక్కుల్ని తీసుకుంటే జుట్టు రాలే సమస్యలు తగ్గుముఖం పడుతాయి. కొంతమంది తలస్నానం చేసిన తరువాత హెయిర్ డ్రైయర్ వాడుతుంటారు.  
 
ఈ హెయిర్ డ్రైయర్ వాడడం వలన చుండ్రు ఎక్కువగా వస్తుంది. దాంతో వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. తడిగా ఉన్న జుట్టును ఆరకుండానే బ్యాండ్‌లు, క్లిప్పులు వేస్తుంటారు. బ్యాండ్లను సాగే విధంగా వేసుకుంటుంటారు. ఇలా సాగే బ్యాండ్లు వేసుకోవడం వలన జుట్టును పెళుసుగా చేసి వెంట్రుకలపై ప్రభావం చూపుతాయి. తద్వారా చుండ్రుతో పాటు జుట్టు రాలే సమస్యలు అధికమవుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు