దువ్వెనను గోరువెచ్చని నీటిలో నానబెట్టి..?

సోమవారం, 1 ఏప్రియల్ 2019 (16:11 IST)
ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం అందరికి గుర్తుకు వచ్చేది దువ్వెన. కానీ, దీని పట్ల ఎవ్వరూ అంతగా జాగ్రత్తలు తీసుకోరు. కొందరికైతే దువ్వెనను శుభ్రం చేయాలనే ఆలోచన కూడా వారిలో రాదు. ఇప్పటి కాలంలో బ్యాగుల్లో అన్నం బాక్స్ లేకపోయినా ఉంటున్నారు కానీ, దువ్వెన లేకుండా ఉండలేకపోతున్నారు.. మరి ఇలాంటి దువ్వెనను ఎలా శుభ్రం చేయాలో చూద్దాం..
 
దువ్వెనలో చిక్కుకుపోయిన జుట్టును పెన్ను లేదా పెన్సిల్‌తో వదులు చేయాలి. ఆ తర్వాత కత్తెర సాయంతో ఎక్కడికక్కడ కత్తిరించి, బయటకు తీయాలి. ఆపై గోరువెచ్చని నీటిలో కొద్దిగా షాంపూ వేసి దువ్వెనను నానబెట్టాలి. ఇక మెత్తని బ్రష్‌తో దువ్వెనను బాగా రుద్దాలి. అలాగని గట్టిగా రుద్దితే దువ్వెనకు ఉండే పళ్లు విరిగిపోతాయి. కనుక కాస్త చూస్తూ రుద్దాలి.
 
బాగా రుద్దిన తర్వాత మళ్ళీ గోరువెచ్చని నీటితో బాగా కడిగి, పొడి టవల్‌తో తుడిచి ఆరబెట్టాలి. అలానే దువ్వెనను నానబెట్టి నీటిలో షాంపూ స్థానంలో బేకింగ్ సోడా, వెనిగర్‌ను ఉపయోగించవచ్చును. దువ్వెనను వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకుంటే మంచిది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు