మొదటి కారణం చెప్పాలంటే.. ఆహారలోపం వలన కూడా జుట్టు రాలుతుంది. సరిగ్గా తినకపోవడం, సరైన పోషకాలు అందకపోవడం వలన జుట్టు బలహీనతంగా మారుతుంది. ఈ సమస్య స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నా కూడా జుట్టు రాలుతుంది. నిద్రలేమి వలన జుట్టుకు పోషకాలు అందకపోవచ్చు. దాంతో కణజాలానికి రిపేర్ జరగకపోవడంతో జుట్టు రాలుతుంది.
వంశపారంపర్యంగా బట్టతల ఉంటే కూడా శరీరంలో హార్మోన్స్ తేడా వస్తుంది. దాంతో జుట్టు రాలే సమస్య ఎక్కువై పోతుంది. అందువలనే చాలామందికి చిన్న వయస్సులోనే జుట్టు రాలడం మొదలవుతుంది. ఒత్తిడి, ఆలోచన ఎక్కువగా ఉన్నా కూడా.. జుట్టు రాలిపోతుంది. కనుక ఒత్తిడిని తగ్గించుకోవడం ఎంతో మేలు చేస్తుంది.