ఉల్లిపాయ ముక్కల్లో కాస్త పంచదార వేస్తే..!?

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (08:43 IST)
ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే కాస్త పంచదారను ముక్కల్లో కలపండి. క్యాబేజీ త్వరగా ఉడకాలంటే చిటికెడు వంట సోడా వేస్తే సరిపోతుంది. క్యాబేజీ వండేటప్పుడు చిన్నఅల్లంముక్క వేస్తే చెడు వాసన రాదు. 
 
కూరగాయలు, ఆకుకూరలు పచ్చదనం కోల్పోకుండా వుండటానికి ఉడకపెట్టేటప్పుడు చిటికెడు ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం వేయాలి.
బెండకాయలన్ని వండేటప్పుడు కనీసం అరగంట ముందు వాటిని కడిగి ఆరబెడితే కూరలో జిగురు ఉండదు. బెండకాయ కూర కరకరలాడుతుండాలంటే ముందురోజు రాత్రి బెండకాయలను తరిగివుంచుకుని మర్నాడు కూర చేయండి. 
 
ఉడకబెట్టిన పొట్టుతీసిన ఆలుగడ్డలు నల్లబడకుండా వుండాలంటే కాస్త ఉప్పు నీటిని చల్లండి. బఠానీలను ఎనిమిది గంటల పాటు నానబెట్టితే రెండు రెట్లు విటమిన్లు పెరుగుతాయి.

వెబ్దునియా పై చదవండి