చలికాలం ప్రారంభమైయింది. కానీ, ఈ కాలంలో సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు పొడిబారిన చర్మాన్ని మరింత దెబ్బతీస్తాయి. మరి ఈ పొడిబారిన చర్మాన్ని ఎలా మృదువుగా, కాంతివంతగా మార్చులో చూద్దాం...
చలికాలంలో కొందరికి నోటికి ఇరువైపులా చర్మం పగిలి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారు ఉదయం, సాయంత్రం వేళలో వెన్నగానీ, నెయ్యిగానీ చర్మానికి రాసుకుంటే పగుళ్లు తగ్గుతాయి. చలి ఎక్కువగా ఉందని ఎండలో కూర్చుంటే స్కిన్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ఎక్కడికైనా బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి గుడ్డ కట్టుకోవడం మంచిది. ఎందుకంటే చలి ప్రభావం వలన చర్మం ముడతలుగా మారుతుంది. దాంతో పొడిబారుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో సబ్బుతో స్నానం చేస్తే చర్మం పొడిబారుతుంది. కాబట్టి సున్నిపిండి, సీకాయ పొడితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది. రాత్రివేళలో గోరువెచ్చని ఆలివ్ నూనెతో గానీ, కొబ్బరి నూనెతో గానీ అలాకాకుంటే.. గ్లిజరిన్ రోజ్ వాటర్‌తో చేతుల్ని, అరచేతుల్ని మర్దన చేసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది.