బాధల్లో ఉన్నవారికి మనం సాయం చేస్తే..?

శుక్రవారం, 28 డిశెంబరు 2018 (15:05 IST)
1. వేలు, లక్షలు ఖర్చుపెట్టి చదివేవారికి ఆ చదువు విలువ తెలుసో, లేదో కానీ..
ఆ వేలు, లక్షలు లేకపోయినా చదువు విలువ తెలిసిన మీరు అందరికన్నా గొప్పవారు..
 
2. నా వద్ద ఓ మంచి పుస్తకం కొనుక్కోవడానికి సరిపడా డబ్బు తక్కువైతే..
ఓ పూట తిండి తగ్గించుకునైనా పుస్తకమే కొనుక్కుంటా..
తిండి తినడం వలన ఓ పూట ఆకలి తీరుతుందేమో కానీ..
ఓ మంచి పుస్తకం చదవడం వలన జీవితంలో కష్ట నష్టాలను ఎదుర్కొనే తెలివి..
ధైర్యం-ఓర్పు సంపాదించుకుంటాను..
 
3. మనం బ్రతికి ఉన్నన్ని రోజులు.. వీడు ఎప్పుడు కనులు మూస్తాడా..
అని ఎవరూ ఎదురు చూడకుండా.. ఉండేలా బ్రతకాలి..
మనం కనులు మూశాక, అయ్యో.. ఓ మంచివాడు మనకిక లేడే..
అని కనీసం పదిమందైనా కన్నీరు కార్చేల బ్రతకాలి..
 
4. బాధల్లో ఉన్నవారికి మనం సాయం చేస్తే..
మనం బాధల్లో ఉన్నప్పుడు ఏదో రూపంలో మనకు తప్పక సాయం అందుతుంది..
 
5. కడుపులోని బిడ్డ తన్నినప్పుడు అమ్మ ఏడుస్తుంది..
బిడ్డ కిందపడిపోయినా సరే అమ్మ ఏడుస్తుంది..
బిడ్డకు అనారోగ్యమైనా అమ్మ ఏడుస్తుంది..
బిడ్డ తినకపోయినా అమ్మ ఏడుస్తుంది..
అలాంటిది అమ్మ ఈ రోజు కడా ఏడుస్తుంది ఎందుకో తెలుసా..?
తన బిడ్డ తనని పట్టించుకోక పోవడం వలనే..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు