కాఫీ, టీలు తాగే అలవాటున్న మహిళలు, గర్భం ధరించిన తర్వాత వీటిని మానేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో కలుపే కృత్రిమ చక్కెరలో రసాయనాలు కలుపుతుంటారు. దీంతో మీరు తీసుకునే కాఫీ లేదా టీ ద్వారా ఆ రసాయనాలు శిశువుకు చేరతాయి, కాబట్టి వీటిని పూర్తిగా మానేసేందుకు ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
గర్భం ధరించక మునుపు రోజుకు 5 లేదా 6 కప్పుల కాఫీ లేదా టీలు సేవిస్తుంటే వాటిని మానేయాలి. లేకుంటే అవి పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అలగే వీటిని అధికంగా తీసుకోవడం వలన ఆకలి చచ్చిపోతుంది. మరో కారణమేంటంటే... సైడ్ ఎఫెక్ట్ కలిగి మీ శరీరం నుంచి నీరు, క్యాల్షియం బయటకు వెళ్ళిపోతుంది. దీంతో మీలో తెలియని నీరసం పుట్టుకొస్తుందంటున్నారు వైద్యులు.
FILE
కాఫీ, టీలు సేవిస్తుంటే మీరు సరిగా నిద్రపోలేరు. నిద్రలేమితో బాధపడుతుంటారు. వీటి కారణంగా శరీరంలో ఇనుము(ఐరన్) శాతం తగ్గిపోతుంది. శిశువు ఎదుగుదలకు పూర్తిగా అవరోధం కలుగుతుంది. శిశువు గుండె బలహీనంగా మారడంతోపాటు గుండె కొట్టుకోవడంలో క్రమం తప్పుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కాఫీ, టీలకు బదులుగా ప్రతి రోజు ప్రకృతి పరమైన పండ్లు తీసుకోండి లేదా పండ్ల రసాలను సేవిస్తుంటే మీ ఆరోగ్యంతోపాటు శిశువు ఆరోగ్యం బాగుంటుంది. దీంతో శిశువు ఎదుగుదల మరింత బాగుంటుందంటున్నారు వైద్య నిపుణులు. గర్భం ధరించిన తర్వాత ప్రతిరోజు ఒక పండు తింటుంటే మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతారని వైద్యులు సూచిస్తున్నారు.