మీ బాయ్‌ ఫ్రెండ్‌కు గిఫ్ట్ కొంటున్నారా...!!

సోమవారం, 17 మే 2010 (17:08 IST)
ND
సాధారణంగా గిఫ్ట్‌లు కొనడం ఒక ఎత్తేతే మీ బాయ్ ఫ్రెండ్‌కు గిఫ్ట్ కొనడం ఓ ఎత్తు. బహుశా మీ బాయ్ ఫ్రెండ్ పుట్టిన రోజు కావచ్చు. అతను మిమ్మల్ని పుట్టిన రోజు ఫంక్షన్‌కు ఆహ్వానించివుంటే ఇక అతని పుట్టిన రోజున ఎలాంటి బహుమతి ఇవ్వాలి... అతని అభిరుచులకు తగ్గట్టు గిఫ్ట్‌ను ఎంచుకోవాల్సివుంటుంది.

ఇందులో మీరు కొనే గిఫ్ట్‌ బడ్జెట్ ఎంత అనేది లిస్ట్ వేసుకోవాలి. సరే రూ. 500లలోపు గిఫ్ట్ కొనాలనుకుంటే మంచి ఐపాడ్ కొనండి. మీరు కొనే గిఫ్ట్ వారికి ఉపయోగపడుతుందా లేదా అనేది మీరు ఆలోచించుకోవాల్సివుంటుంది.

గిఫ్ట్ ఏదైనా కావచ్చు... మహిళలకు ఇవ్వాలనుకుంటే బోలెడన్ని గిఫ్ట్‌లు అందుబాటులోకి వస్తాయి. కాని పురుషులకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, అందునా బాయ్ ఫ్రెండ్‌కైతే మరీనూ... అది కూడా అతని పుట్టిన రోజాయే. పుట్టిన రోజు కాబట్టి...మంచి పుస్తకం, పది మంది మెచ్చుకోదగ్గది, అతను చదివితే ఆ పుస్తకం అతను భద్రంగా తన లైబ్రరీలో దాచుకునేదై ఉండాలి. డెయిరీ, గడియారం, పర్ఫ్యూం, టై పిన్, టై, షర్ట్, మొబైల్ ఫోన్, పెన్, గాగుల్స్, బెల్ట్ మొదలైనవి...మీ బడ్జెట్‌కు తగ్గ గిఫ్ట్ కొని అతనికి సర్ప్రైజ్ చేయండి. బహుశా మీ బడ్జెట్ భారీగానే ఉంటే మాత్రం ల్యాప్‌టాప్, కంప్యూటర్, విలువైన మొబైల్ ఫోన్, ఐపాడ్, మ్యూజిక్ సిస్టమ్, ఎల్‌సిడి టివి తదితరాలు ఇవ్వవచ్చు.

ఎలాంటి గిఫ్ట్ కొనాలో మీకు తోచకపోతే లేదా గిఫ్ట్ కొనే సమయం మీవద్ద లేకపోతే ఏదైనా బ్యాంకుకు చెందిన గిఫ్ట్ కార్డ్ ప్రెజెంట్ చేయొచ్చు. కాని డబ్బుగా మాత్రం గిఫ్ట్ అనుకుని డబ్బును కవర్లో పెట్టి మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే డబ్బులు ఖర్చైపోతాయి. వస్తువు రూపంలో గిఫ్ట్ ఇస్తే దానిని భద్రంగా పదిలపరచుకోవచ్చు. కాబట్టి మీ బడ్జెట్‌కు తగ్గట్టు గిఫ్ట్ కొనుక్కుని మరీ వెళ్ళండి. గిఫ్ట్ కొనేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోను హడావుడి పనికి రాదు. ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని గిఫ్ట్ కొనండి.

వెబ్దునియా పై చదవండి