శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి 2007లో మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం పూర్తిచేశారు. అదే ఏడాది తేజ టీవీలో చేరారు. ఆ తర్వాత సాక్షి టీవీ, వనితటీవీ, మోజో టీవీలలో వివిధ రకాల బాధ్యతలు నిర్వర్తించారు. 2018 నుంచి ప్రజాటైమ్స్ అనే వెబ్ సైట్, దర్శనం లైవ్, వసుధ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ పనిచేసినా స్త్రీలకు సంబంధించిన అంశాలపై కార్యక్రమాలు రూపొందించడంలో ముందుంటారు.
అలా స్త్రీల సమస్యలపై చేసిన ఎన్నో స్టోరీలకు, చర్చా కథనాలకు యూనిసెఫ్.. లాడ్లి, ఎన్టీవీ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా స్త్రీల కోసమే వసుధ టీవీ నడుపుతూ మహిళా సాధికారతకు అహర్నిశలు కృషిచేస్తున్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలపట్ల చూపుతున్న భేదభావం మానవ ప్రగతికి విఘాతం కలిగిస్తుంది.
ప్రతి మహిళా నిర్భయంగా అన్నీ రంగాలల్లో రాణించిన్నప్పుడే స్త్రీకి నిజమైన స్వేచ్ఛ ఉన్నట్లని అన్నారు వంశీప్రియారెడ్డి. తనపై నమ్మకం ఉంచి బాధ్యతను, అవకాశాన్ని కల్పించిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మెన్ బి. వెంకటేశ్వర్ రాజు గారికి మరియు జాతీయ ఉపాధ్యక్షురాలు కళ్యాణి గారికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.