న్యూఢిల్లీ కామన్వెల్త్ క్రీడలు: నేడు ముగింపు వేడుకలు

దేశ రాజధాని న్యూఢిల్లీలో పది రోజుల పాటు కన్నులపండుగగా సాగిన 19వ కామన్వెల్త్ క్రీడ సంబంరాలు గురువారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా రాత్రి ఏడు గంటలకు ముగింపు వేడుకలు జరుగున్నాయి. ఈ వేడుకలకు శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

క్రీడల ప్రారంభోత్సవాలను నిర్వహించిన విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ సంస్తే ఈ ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలపై ఆ సంస్థ ఎండీ విరాఫ్ సర్కారీ మాట్లాడుతూ క్రీడల ప్రారంభ ఉత్సవం భారత సంస్కృతి, సంప్రదాయాలపై దృష్టి కేంద్రీకరించగా, ముగింపు వేడుకలు మాత్రం వర్తమాన భారత్‌ను ప్రతిబింభిస్తాయన్నారు.

ఈ ముగింపు వేడుకలను లేజర్‌షోతో నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ సందర్భంగా పెద్ద పాప్ పార్టీని నిర్వహిస్తామని చెప్పారు. కాగా, ఈ వేడుకలకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటుల్లో ఏ ఒక్కరినీ ఆహ్వానించలేదు.

వెబ్దునియా పై చదవండి