న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ సరికొత్త రికార్డు!

FILE
ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. 2002 కామన్వెల్త్ రికార్డును భారత్ అధిగమించింది. మహిళల పది మీటర్లు షూటింగ్ విభాగంలో అను రాజ్ సింగ్- హినా సిద్ధు స్వర్ణ పతకాన్ని సాధించడం ద్వారా భారత్ ఖాతాలో 31వ బంగార పతకం చేరింది. దీంతో 2002లో మాంచెస్టర్ కామన్వెల్త్ రికార్డును భారత్ అధిగమించింది. అను-హినా సాధించిన స్వర్ణంతో షూటింగ్ విభాగంలో 14వ బంగారు పతకం చేరింది.

ఒకవైపు బంగారు పతకాల పండిస్తున్న భారత క్రీడాకారులు వెండి, కాంస్య పతకాలను సైతం కైవసం చేసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్ తేజస్విని సావంత్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో రజత పతకం సొంతం చేసుకోగా, చంద్రశేఖర్ కుమార్ చౌదరి మరియు సమ్రేష్ జంగ్ సైతం 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టోల్ విభాగంలో వెండి పతకం సాధించాడు. దీంతో భారత్ 31 స్వర్ణ పతకాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి