షూటింగ్‌లో భారత్‌కు రజతం: బాక్సింగ్‌లో శ్రీలంక రికార్డు!

FILE
న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ పోటీల్లో భారత షూటర్లు ఓ మెరుపు మెరుస్తున్నారు. కామన్వెల్త్ పోటీల్లో బుధవారం భారత్ రజత పతకం సొంతమైంది. మహిళా షూటింగ్ పది మీటర్ల విభాగంలో హీనా సిద్ధు రజత పతకం సొంతం చేసుకుంది. అలాగే పది మీటర్ల షూటింగ్ విభాగంలో మలేషియా క్రీడాకారిణి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

ఇకపోతే., మహిళా హాకీ మూడో స్థానం కోసం జరిగిన పోటీలో దక్షిణాఫ్రికాను ఇంగ్లాండ్ 1-0 తేడాతో ఓడించి కాంస్య పతకం సొంతం చేసుకుంది. అలాగే కామన్వెల్త్ గేమ్స్‌ బాక్సింగ్ పోటీల్లో శ్రీలంక రికార్డు సృష్టించింది. గత 1938 సంవత్సరానికి తర్వాత శ్రీలంక కామన్వెల్త్ బాక్సింగ్ విభాగంలో తొలి స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.

56 కేజీల ఫైనల్ పోరులో శ్రీలంక స్టార్ బాక్సర్ మంజు వన్నియార్చి.. మెక్‌గోల్డ్రిక్‌ను 7-7 తేడాతో మట్టికరిపించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో 60 ఏళ్ల తర్వాత బాక్సింగ్‌లో తొలి స్వర్ణ పతకం సాధించిన శ్రీలంక బాక్సర్‌గా వన్నియార్చి రికార్డు సృష్టించింది.

ఈ సందర్భంగా 31 ఏళ్ల వన్నియార్చి మాట్లాడుతూ.. భారత్ గడ్డపై జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తాను చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకోవడానికి కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్య మిచ్చిన భారత్‌కు వన్నియార్చి కృతజ్ఞతలు తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి