జీర్ణవ్యవస్థను మెరుగుపర్చే వక్రాసనం

శనివారం, 8 మే 2010 (19:37 IST)
పద్మాసన భంగిమలో చేసే ఆసనమే వక్రాసనం. సంస్కృతంలో వక్ర అంటే వంకర లేక వంపు అని అర్థం. వెన్నెముకను శరీరంలో ఒక వైపుకు వంకరగా తిప్పగలిగే ఆసనమే వక్రాసనం.

చేసే పద్ధతి -
కాళ్లను ముందుకు చాపి దండాసన పద్ధతిలో కూర్చోవాలి.
కుడికాలిని పైకి మడిచి ఎడమ మోకాలి వద్దకు మీ కుడిపాదాన్ని జరపండి.
ఎడమ చేతిని కుడి మోకాలు పై భాగాన నిటారుగా చాపి ఉంచండి.
కుడి చేతిని వీపు వెనుక ఆధారం కోసం ఆనించండి.
వెన్నెముకను నిటారుగా ఉంచి ఎడమ చేతితో కుడి కాలివేళ్లను పట్టుకోండి
ఛాతీ భాగాన్ని మరింతగా కుడివైపుకు తిప్పి మెడను మీ వెనుక వైపుకు తిప్పి ఉంచండి
వీలైనంత సేపు ఈ స్థితిలో అలాగే ఉండండి.
మెడను, ఛాతీ భాగాన్ని ముందువైపుకు తిప్పి, చేతిని వదిలి, కాళ్లను చాచండి.
దండాసనం భంగిమలో కూర్చోండి.

WD
ప్రయోజనాలు
వెన్నెముకను ఉత్తేజపరుస్తుంది.
వీపు కుడి ఎడమ వైపులకు సులువుగా తిరిగేలా చేస్తుంది.
జీర్ణవ్యవస్థకు మెత్తగా మర్దన జరుగుతుంది కాబట్టి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
నడుము పట్టడం, కండరాల నొప్పి తగ్గిపోతాయి.
మెడపట్టకుండా, సులువుగా తిరగడానికి ఇది తోడ్పడుతుంది.

జాగ్రత్తలు-
వీపు, మెడ నొప్పి ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.
కీలు సంబంధ సమస్యలు ఉన్నవారు లేదా స్పాండిలైటిస్ వ్యాధి ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.

వెబ్దునియా పై చదవండి