వజ్రాసనం

శనివారం, 8 మే 2010 (19:26 IST)
క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది.

వజ్రాసనం చేయు పద్ధతి:
తొలుత సుఖాసన స్థితిని పొందాలి
నిటారుగా కూర్చోవాలి.
రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.
ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి.
వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి.
WD


పాదం కింది భాగం(అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి.
మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.
పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి.
వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి.
అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి.
రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.
తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి.
వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి.

వజ్రాసనంలో రెండో పద్ధతి:
ఈ పద్ధతిలో పైకి కనపడుతున్న పాదాలను ఆసనానికి ఇరువైపులా కాకుండా ఆసనానికి కింది భాగంలో మీరు చేర్చగలరు.
ఆ క్రమంలో కాలివేళ్లు ఒకదానిపై ఒకటి చేరగా కాలి మడమలపై మీరు కూర్చుంటారు.
ఊర్థ్వభాగానికి తిరిగిన కాలిమడమలకు చెందిన అంతర్ భాగాలపై ఆసీనులవుతారు.
మొదట ప్రస్తావించిన వజ్రాసనం పద్ధతిలో ప్రస్తావించినట్లుగా ఈ పద్ధతిలో ఆసనం నేలను తాకదు.
శ్వాస ప్రక్రియ యధాతధం.

ప్రయోజనాలు:
తొడభాగాన గల అదనపు కొవ్వును తగ్గిస్తుంది.
వెన్నెముకకు మంచి వ్యాయామం.
ఉదరసంబంధిత అవయవాల క్రియలను క్రమబద్ధీకరించును
వెన్నెముక సంబంధిత కండరాలకు బలాన్నివ్వడమేకాక.. శరీరకదలికలకు అనుగుణంగా కండరాలు పనిచేస్తాయి.
కటి (శ్రోణి) సంబంధిత భాగాలు బలపడతాయి.
బిగుతుగా ఉన్న బంధకములు, కాలి వ్రేళ్ల కండరాలు, కాలి వ్రేళ్లకు మధ్య గల భాగము, చీలమండ భాగము, తొడ యొక్క పై భాగము (పిరుదులు) తదితర భాగాలు వదులగును

జాగ్రత్తలు:
మోకాళ్ల నొప్పులు లేదా శరీరానికి గాయాలు తగిలినప్పుడు ఈ ఆసనం వేయకూడదు.

వెబ్దునియా పై చదవండి