క్రమశిక్షణకు మారుపేరు వైఎస్సార్

WD
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధను కనబరిచేవారు. ఉదయం వేకువ జామునే లేచి ఓ 20 నిమిషాలు నడక సాగించేవారు. ఒకవేళ ఏదైనా పనివల్ల నడక మిస్ అయినా ట్రెడ్‌మిల్ చేయడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసేవారు కాదు.

ఇక ఆహారపుటలవాట్ల విషయానికి వస్తే... ఆయన మితాహారి. పార్టీలకు, ఫంక్షన్లకు హాజరైనా కేవలం మితాహార నియమాలను పాటించేవారు. ఆహారంలో కీరదోసను భాగం చేసుకునేవారు. అన్నిటికీ మించి భోజన సమయాన్ని మిస్ చేసేవారు కాదు. ఎన్ని పనులున్నా... వాటికి కాస్తంత బ్రేక్ పెట్టి సమయానికి భోజనం చేసేవారు. ఇదే విషయాన్ని తన మంత్రులకు, అధికారులకు సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పేవారట.

ఒక రాష్ట్రాధినేత అయి ఉండికూడా తన పనులను తానే చేసుకునేవారట. విదేశాలకో... టూర్లకో వెళ్లినపుడు తను వేసుకుని విడిచిన బట్టలను తానే మడతపెట్టి డ్రై క్లీనింగ్ షాపుకు పంపేవారట. అలాగే తనకు సంబంధించిన దుస్తులను తానే ఇస్త్రీ చేసుకోవడం వంటివన్నీ ఆయనే స్వయంగా చేసుకునేవారట. ఇలా చిన్నప్పట్నుంచి క్రమశిక్షణతో తన పనులను తనే చేసుకునేవారట వైఎస్.

వెబ్దునియా పై చదవండి