13-11-2022 ఆదివారం దినఫలాలు - సూర్య నారాయణ పారాయణ చేసినా.... (video)
ఆదివారం, 13 నవంబరు 2022 (04:00 IST)
మేషం :- కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతిని దూరం చేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రాజకీయనాయకులు ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. మిత్రులతో మనస్పర్థలు తలెత్తవచ్చు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది.
వృషభం :- కొత్త ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ బంధవులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మిథునం :- చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. స్త్రీల సరదాలు, మనోవాంఛలు నెరవేరుతాయి. ఉమ్మడి వ్యవహరాల్లో పట్టింపులెదురవుతాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. నూతన విషయాలను తెలుసుకుంటారు.
కర్కాటకం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఖర్చులు ముందుగానే ఊహించినవి కావటంతో ఇబ్బందులు తలెత్తవు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మీ యత్నాలకు ఆటంకాలు తొలగిపోయి పనులు సానుకూలమవుతాయి.
సింహం :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మిత్రులను కలుసుకుంటారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. ప్రేమికులు అతిగా వ్యవహరించటంవల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఖర్చులు, కుటుంబ అవసరాలు మరింతగా పెరుగుతాయి.
కన్య :- నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. దైవదర్శనాలు చేసుకుంటారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంటా బయటా చికాకులు పెరిగే అవకాశం ఉంది.
తుల :- స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన అవసరం. గతానుభవాలు జ్ఞప్తికి రాగలవు. విందులు, వినోదాల్లో మితంగా వ్యవహరించండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని ఇబ్బందులెదురవుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అసవరం. గృహోపకరణాలను అమర్చుకుంటారు. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది.
వృశ్చికం :- చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి కాగలవు. పెరిగిన కుటుంబ అవసరాలు, రాబడికి మించిన ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. ప్రయాణాలు అనుకూలం. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కీలకమైన వ్యవహారాల్లో మెలకువ వహించండి.
ధనస్సు :- రాజకీయ నాయకులకు ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి.
మకరం :- విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు.
కుంభం :- మీ సంతానం వైఖరి చికాకు పరుస్తుంది. వాధానాలు చేయడం వల్ల ఆటంకాలను ఎదుర్కొటారు. సంఘంలో పలకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి. ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. బంధువుల రాకతో పనులు వాయిదా పడతాయి. పెద్దల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది.
మీనం :- కుటుంబీకులతో అవగాహన లోపిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి, వస్తులాభం, వాహన యోగంవంటి శుభ ఫలితాలు పొందుతారు. స్త్రీలు వాగ్విదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యాలల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది.