కొన్ని వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని వాటిల్లో రెండు లీటర్ల ఆవు పాలను పోసుకుని పాలు ఇంకిపోయేంత వరకు బాగా మరిగించుకోవాలి. మరికొన్ని వెల్లుల్లి పాయల్ని పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో దాల్చిన చెక్క పొడి, జాజిపత్రి పొడి, మిరియాలు, యాలకులు, కరక్కాయల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమంలో బెల్లం పాకం వేసుకుని శనగ గింజలంత మాత్రలు తయారుచేసుకుని భద్రపరచుకోవాలి. ఈ మాత్రలను ప్రతిరోజూ మూడు పూటలా రెండు తీసుకుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, చేతులు వణకడం వంటి సమస్యలు నుండి విముక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.