బొప్పాయి గుజ్జులో పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

మంగళవారం, 28 ఆగస్టు 2018 (18:06 IST)
చాలామందికి చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. అటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. పెసరపిండిలో కొద్దిగా తేనె, పచ్చిపాలను కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది.
 
బొప్పాయి గుజ్జులో కొద్దిగా పెరుగు, తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. బంతిపువ్వుల రేకులను ఎండబెట్టుకుని వాటిని పొడిచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. 
 
కీరదోసను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే ఈ శీతాకాలంలో మంచిది. ప్రతిరోజూ నాలుగైదు లీటర్ల నీళ్లను తీసుకుంటే చర్మం సహజసిద్ధంగా ఉంటుంది. రాత్రి సమయంలో శరీరానికి నూనె రాసుకుని ఉదయాన్నే స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు