తెలంగాణాలో అత్యుత్తమంగా జీవించేందుకు వినియోగదారుల ఎంపికలను కంట్రీ డిలైట్‌ ఏవిధంగా మారుస్తోంది?

శుక్రవారం, 12 ఆగస్టు 2022 (20:43 IST)
భారతదేశపు తాజా ఆహారం, ప్రధానమైన ఆహార పదార్థాల మార్కెట్‌ 2025 నాటికి 50 బిలియన్‌ డాలర్లను అధిగమిస్తుందని అంచనా. నేడు, దాదాపు 60%కు పైగా ఫ్రెష్‌ ఫుడ్‌ మార్కెట్‌ అసంఘటిత రంగంలో పరిమిత శీతల గిడ్డంగుల సదుపాయాలతో, సరైన రవాణా సదుపాయాలు మరియు తగినంత విజిబిలిటీ, సరఫరా చైన్‌ లేకుండా లభిస్తున్నాయి. కంట్రీ డిలైట్‌ సాంకేతికాధారిత సరఫరా చైన్‌ ద్వారా ఈ సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

 
సాంకేతికాధారిత డైరెక్ట్‌ టు హోమ్‌ కన్స్యూమర్‌ బ్రాండ్‌ కంట్రీ డిలైట్‌. వినియోగదారుల జీవితాలను మెరుగుపరిచే ఉత్పత్తులను అందించేందుకు ఇది సహాయపడుతుంది. కంట్రీ డిలైట్‌ ఉత్పత్తి డీఎన్‌ఏలో అత్యంత కీలకంగా నేచురల్‌ వెల్‌నెస్‌ ఉంటుంది. మేము సరఫరా చేసే ప్రతి ఉత్పత్తీ సహజసిద్ధమైనది. స్వచ్ఛమైనది (మధ్యవర్తులు లేరు), తాజాగా ఉంటుంది (పూర్తి సొంతమైన సరఫరా చైన్‌) మరియు కనీస ప్రాసెస్‌ చేయబడింది(వీలైనంత వరకూ ఇంటిలో తయారుచేసిన రీతిలో ఉంటాయి). కంట్రీ డిలైట్‌ ఇప్పుడు నెలకు 8 మిలియన్‌ డెలివరీలను 15 నగరాలలో చేస్తుంది. దీని సరఫరా చైన్‌ భారతదేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలలో విస్తరించి ఉంది.

 
ప్యాకేజ్డ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ మన జీవితాలలో అంతర్భాగంగా మారాయి. WHO గణాంకాల ప్రకారం భారతదేశంలో 2012 తరువాత ఆహార పదార్థాల కల్తీ రెట్టింపు కావడంతో పాటుగా 28%పైగా ఫుడ్‌ శాంపిల్స్‌ కల్తీ చేయబడ్డాయని గుర్తించింది. ఈ కల్తీని నిరోధించేందుకు సాంకేతికాధారిత, వినియోగదారుల లక్ష్యిత విధానాన్ని కంట్రీడిలైట్‌ అనుసరిస్తుంది. భారతదేశంలో సుప్రసిద్ధ డీ2సీ ఫ్రెష్‌ ఫుడ్‌ ఎసెన్షియల్స్‌ బ్రాండ్‌గా ఇది నిలువడంతో పాటుగా పాలు, పండ్లు, కూరగాయలను వినియోగదారుల ఇంటి ముంగిటనే అందిస్తుంది. ఈ కంపెనీ యొక్క వ్యాపార నమూనా కారణంగా తాజా డెలివరీలను 24-36 గంటల లోపే పొందవచ్చు.

 
‘‘ప్రారంభం నుంచి కూడా సరఫరా పరంగా కంట్రీడిలైట్‌, అతి తక్కువ వాటాదారులతో కలిసి పనిచేయాలనే సిద్ధాంతం అనుసరిస్తుంది. ఇక్కడ మీరు అత్యధిక పరిమాణంలో క్వాంటిటీలను పొందడంతో పాటుగా అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులనూ పొందవచ్చు. ఇది రెండు లేదా మూడు ఫార్మాట్‌లలో వస్తుంది’’ అని కంట్రీడిలైట్‌ కో-ఫౌండర్‌ చక్రధర్‌ గాదె అన్నారు.

 
ఈ టీమ్‌ ఇప్పుడు ఐఓటీ ఇంటిగ్రేషన్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఇది బ్యాక్టీరియా వృద్ధిపై వాస్తవ సమయంలో అప్‌డేట్స్‌ అందిస్తుంది. దీనిలో టీమ్‌ అన్ని నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంతో పాటుగా చెల్లింపులకు సంబంధించిన సమాచారమూ పొందుతుంది. ముఖ్యంగా, కంట్రీడిలైట్‌  సబ్‌స్ర్కిప్షన్‌ ఆధారిత వ్యాపారంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇది అత్యున్నతంగా రికరింగ్‌ ఆదాయం అందిస్తుంది. ప్రాధమికంగా స్ధిరమైన వ్యాపారం సృష్టించడాన్ని కంట్రీడిలైట్‌ నమ్ముతుంది. కంట్రీడిలైట్‌కు అతి ప్రధానమైన మార్కెట్‌ తెలంగాణా. పాలు- లేత కొబ్బరికాయలు ఇక్కడ ఎక్కువగా విక్రయించబడుతున్నాయి. కంట్రీడిలైట్‌ వీటికోసం స్థానిక రైతులతో భాగస్వామ్యం చేసుకుంది. అలాగే తెలంగాణాలోని పాల ఉత్పత్తిదారులతోనూ భాగస్వామ్యం చేసుకుంది. కంట్రీడిలైట్‌ ప్రస్తుతం తెలంగాణా మార్కెట్‌పై దృష్టిసారించింది. హైదరాబాద్‌, వరంగల్‌ మరియు రాష్ట్రంలోని  ఇతర ప్రధాన నగరాలలో తమ వ్యాపారం బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు