దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు ఆగడం లేదు. ఈ ధరలు రోజురోజూకూ పైపైకి పోతున్నాయి. ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలు మరింత పైకి వెళ్తున్నాయి. తాజాగా మంగళవారం చమురు కంపెనీలు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 31 పైసలు వరకు పెంచాయి.
ఈ తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.81, డీజిల్ లీటర్ రూ.89.18కు పెరిగింది. గత నెల నుంచి ఇప్పటి వరకు 33 సార్లు లీటర్ పెట్రోల్‌పై రూ.8.49, డీజిల్‌పై రూ.8.39 పెరిగింది. చెన్నైలో పెట్రోల్ రూ.99.80.. డీజిల్ రూ.93.72గా ఉంది.
అలాగే, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల పరిధిలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్ ధర రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.102.69.. డీజిల్ రూ.97.20, విజయవాడలో పెట్రోల్ రూ.104.58, డీజిల్ రూ.98.52 చొప్పున ఉన్నాయి.