ట్విట్టర్ రారాజు సెహ్వాగ్‌ కొత్త రచ్చ.. భారత్-పాక్ మ్యాచ్‌పై ప్లాన్లు ఏంటో చెప్పమంటున్నాడు

బుధవారం, 31 మే 2017 (16:41 IST)
ట్విట్టర్ రారాజు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ దొరికింది. ఈ మ్యాచ్‌పై ప్రజలు, నెటిజన్లు విభిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాన్ని చేతికి తీసుకున్న సెహ్వాగ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగే భారత్-పాక్ మ్యాచ్‌పై అభిమానులు తమ ప్రణాళికలను తనతో షేర్ చేసుకోవాలని పిలుపు నిచ్చాడు. ఛాంపియన్స్ ట్రీఫీకి హై ఓల్టేజ్ మ్యాచ్‌గా నిలిచే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు అమితాసక్తితో ఉన్నారు. 
 
ఇంగ్లాండ్ వేదికగా జూన్ 1 నుంచి 18 వరకు ఛాంపియన్స్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో సెహ్వాగ్ కామెంటేటర్స్ ప్యానెల్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ కోసం ఓ సగటు అభిమాని లాగే సెహ్వాగ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. అందుకే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పట్ల అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటున్నాడు.
 
ఇందుకోసం ట్విట్టర్లో సెహ్వాగ్ ఇచ్చిన పిలుపుకు పలువురు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. 'జూన్ 4 కోసం వేచి చూడలేకపోతే రీట్వీట్ చేయండి. అద్భుతమైన మ్యాచ్‌ని ఎలా వీక్షిస్తారో మీ ప్లాన్స్‌ని నాతో షేర్ చేసుకోండి' అని సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

వెబ్దునియా పై చదవండి