ఆసియా క్రికెట్ కప్ టోర్నీలో భాగంగా మరికొన్ని నిమిషాల్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య కీలకమైన ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ సర్వసన్నద్ధంగా ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
మరోవైపు టోర్నీ చరిత్రలో ఎక్కువగా 13 సార్లు ఫైనన్‌కు చేరిన శ్రీలంక గతేడాది టీ20 ఫార్మాట్లో విజేతగా నిలిచింది. ఈ జట్టు మరోసారి టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తోంది. భారత్ నుంచి అక్షర్, శ్రీలంక నుంచి తీక్షణ గాయం కారణంగా దూరమవుతున్నారు.