దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న టెస్టు సిరీస్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. ఇంకా టెస్టు సిక్సుల్లో రికార్డు సృష్టించాడు. టెస్టు కెరీర్‌లో ఆరో సెంచరీని పూర్తి చేసిన రోహిత్ శర్మ.. 17 సిక్సులతో అదరగొట్టాడు. గతంలో విండీస్ స్టార్ ప్లేయర్ షిమ్రోన్.. బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లో 15 సిక్సులతో వున్న రికార్డును రోహిత్ శర్మ 17 సిక్సులతో అధిగమించాడు.
2010లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక సంవత్సరంలో 14 పరుగులు చేసిన రికార్డు హర్భజన్ సింగ్ పేరిట ఉంది. ఆ సిరీస్‌లో భజ్జీ రెండు సెంచరీలు చేసిన ఘనత ఉంది. అప్పటి నుంచి మరే భారత క్రికెటర్ చేయలేనన్ని సిక్సులతో రోహిత్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ తొలి రోజును విజయవంతంగా పూర్తి చేశాడు.
ఇకపోతే.. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ మూడో టెస్టులో బ్యాడ్ లైట్ కారణంగా తొలి రోజు ఆటను నిలిపివేశారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(117), రహానే(83) పరుగులు చేశారు.