స్నానం చేస్తుండగా న్యూడ్ ఫోటోలు.. వాటిని చూపిస్తూ యేడాదిగా అత్యాచారం

శుక్రవారం, 3 మార్చి 2023 (10:54 IST)
పొరుగింటి మహిళ స్నానం చేస్తుండగా ఓ కామాంధుడు ఆమెను నగ్నంగా ఫోటోలు తీశాడు. వాటిని చూపి బెదిరిస్తూ ఒక యేడాది కాలంగా ఆమెపై లైంగికదాడికి పాల్పడుతూ వచ్చాడు. విజయవాడ నగరంలో ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని విశాలాంధ్ర కాలనీకి చెందిన పుట్టా సుభాష్ (45) అనే వ్యక్తి బీపీసీఎల్ కంపెనీలో పైపులైన్ సెట్టింగ్ చేసే కార్మికుడు. రాజీవ్ నగర్‌కు చెందిన ఓ మహి (35) శాంతి నగర్‌లో భర్తతో కలిసి చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తుంది. పలుమార్లు ఆ దుకాణంలో సరకులు కొనుగోలు చేసిన సుభాష్... పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించేవాడు. 
 
ఈ క్రమంలో ఆమె నంబరు తీసుకున్నాడు. ఇదిలావుంటే ఓ రోజున ఆమె స్నానం చేస్తుండగా, ఫోటోలు తీశాడు. వీటిని ఆమె ఫోనుకు పంపుతూ వేధించసాగాడు. పైగా వాటిని చూపి బెదిరించి అత్యాచారానికి తెగబడ్డాడు. అలా గత యేడాది కాలంగా బెదిరిస్తూనే అత్యాచారం చేస్తున్నాడు. 
 
అక్కడితో ఆగకుండా తనకు రూ.16 లక్షల డబ్బులు కావాలంటూ డిమాండ్ చేసి తీసుకున్నాడు. ఆ డబ్బును చెల్లించమని అడిగినందుకు ఆమెపై దాడి చేశాడు. అతని ఆగడాలు శృతిమించి పోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సుభాష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. కామాంధుడిని అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు