సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సూర్వదేవర వినోద్ నిర్మాతగా రూపొందిన ఘటోత్కచ యానిమేషన్ చిత్రం దీపావళినాడు విడుదలకానుంది. 100 నిమిషాల నిడివిగల ఈ సినిమా ఏడు భాషల్లో విడుదలవుతుంది.
ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నామని సన్ ఏనిమిటిక్స్ అండ్ షిమారూ ప్రొడక్షన్స్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఘటోత్కచుని జీవితంలో బాల్యం నుంచి చివరివరకూ జరిగే సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయని పేర్కొంది. మ్యాజిక్కులు, మంత్రాలు ఆబాల గోపాలన్నీ ముగ్దుల్ని చేస్తాయని తెలపింది. మైథాలజికల్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉందనీ, అందుకే ఈ చిత్రాన్ని నిర్మించామని తెలిపింది.
48 కెమేరాలతో అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. ఈ చిత్ర నిర్మాణాన్ని ఫిలిప్పీన్స్, సింగపూర్, ఇంగ్లండ్, కెనడా, ఇండియాలో చేపట్టారు. తెలుగు విభాగానికి సంబంధించి మాటలు: ఎన్‌వి.బి. చౌదరీ, పాటలు: వేటూరి, వెన్నెలకంటి, కులశేఖర్, భువనచంద్ర