ఆకాష్-కీర్తీ చావ్లా జంటగా 'అతడే'

గురువారం, 13 సెప్టెంబరు 2007 (11:32 IST)
WD PhotoWD
ఆకాష్, కీర్తీ చావ్లా హీరోహీరోయిన్లుగా ఎంకే.త్యాగరాజన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'అతడే' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తమిళంలో కూడా.. 'నినైత్తదై ముడిప్పవన్' అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రొగ్రెస్‌ను నిర్మాత కె.రామాంజనేయులు హైదరాబాద్‌లో వివరించారు. త్యాగరాజాన్‌ ఇప్పటి వరకు రెండు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. ఆయన లోగడ నిర్మించిన 'మానగర కావల్' అనే చిత్రం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం చాలా కాలం తర్వాత ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

'అతడే' చిత్రం షూటింగ్ కొద్దిగా మిగిలి వుందని దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ.. ఉగ్రవాద నేపథ్యంలో రూపొందిన కథ ఇది. ఉగ్రవాదులు పార్లమెంట్‌ను ఎటాక్ చేసి, ఇక్కడి వ్యవస్థను అస్తవ్యస్థం చేయాలనే ఆలోనను పసిగట్టే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకాష్ నటిస్తున్నారని చెప్పారు. హీరో ఆకాష్ మాట్లాడుతూ.. పూర్తి యాక్షన్ భరిత చిత్రంలో సీబీఐ ఆఫీసర్‌గా నటిస్తున్నట్టు చెప్పారు.

తమిళంలో పూర్తిగా యాక్షన్ భరిత చిత్రంలో చేసినప్పటికీ.. తెలుగులో మాత్రం ఇది తొలి చిత్రమన్నారు. అతడే చిత్రంలో ఇంకా.. రిజాయ్ ఖాన్, ఐశ్వర్య, దళపతి దినేష్ తదితరులు నటించే ఈ చిత్రానికి కెమరా.. ఆర్పీ.ఇమయవర్మ, మాటలు.. రాజశేఖర్, సంగీతం.. దేవా, నిర్మత..రామాంజనేయులు, కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే.. ఎంకే.త్యాగరాజన్.

వెబ్దునియా పై చదవండి