ఆయన కోలీవుడ్ కోహినూర్ వజ్రం: నమిత

మంగళవారం, 9 అక్టోబరు 2007 (18:31 IST)
'శివపుత్రుడు', 'అపరిచితుడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విక్రమ్. నటనలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి తమిళ చిత్ర రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ తెలుగులో నటిస్తున్న చిత్రం 'మల్లన్న' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇదిలావుండగా.. ఆరు అడుగుల అందంతో తమిళ చిత్ర సీమలో సెక్సీతారగా గుర్తింపు పొందిన నటి నమిత. ఆమె ఇటీవల తమిళ హీరోలపై తన మనస్సులోని మాటలను చెప్పింది.

సియాన్ విక్రమ్ తమిళ చిత్ర రంగానికి దొరికిన కోహినూర్ వజ్రమని నమిత వ్యాఖ్యానించింది. చిత్రమేమంటే నమిత ఇంకా విక్రమ్‌తో ఒక్క సినిమా కూడా చేయక పోవడం విశేషం. అయినా విక్రమ్ అంటే నమితకు విపరీతమైన అభిమానమట. ఆయన సినిమాలు, సేతు, పితామహన్, అన్నియన్‌ చిత్రాల్లో విక్రమ్ నటన అద్భుతమని అందుకే ఆయనంటే అంత ఇష్టమని తెగ పొగడ్తల వర్షం కురిపించింది. భవిష్యత్‌లో ఆయనతో ఒక్క సినిమా అయినా చేయలేనా అని ఆశతో సెక్సీక్వీన్ ఉంది. ఆల్ ది బెస్ట్ నమిత.

వెబ్దునియా పై చదవండి