మా ప్రేమ కథకు నాన్నే నిర్మాతగా ఉండాలి: శ్రీజ

బుధవారం, 24 అక్టోబరు 2007 (14:58 IST)
మెగాస్టార్ ద్వితీయ కుమార్తె శ్రీజ-శిరీష్ భరద్వాజ్‌ల వివాహం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో పెను సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అయితే.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై విమర్శనాస్త్రాలు సంధించడంలో మాత్రం.. శ్రీజ ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు.

తాజాగా.. తమ ప్రేమ కథ బాలీవుడ్ లేదా టాలీవుడ్‌ చిత్రరంగంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించేందుకు సరిగ్గా సరిపోతుందని శ్రీజ అంటోంది. ఒకవేళ తమ ప్రేమ కథ తెరకెక్కితే.. ఆ చిత్రానికి తన తనండ్రి మెగాస్టారే నిర్మాతగా ఉండాలని శ్రీజ భావిస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా.. ఈ చిత్రంలో తన భర్త శిరీష్‌తో కలసి నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు శ్రీజ న్యూఢిల్లీలో మీడియాతో వ్యాఖ్యానించింది.

మా నాన్నకు ఒక్క విషయం చెపుతున్నా.. నేను సురక్షితమైన హస్తాల్లోనే ఉన్నాట్టు స్పష్టం చేసింది. శ్రీజ-శిరీష్ దంపతులకు పోలీసు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన మరుక్షణమే.. శ్రీజ తమ ప్రేమ వ్యవహారంపై స్పందించారు. తమ ప్రేమ వివాహానికి తండ్రి చిరంజీవి సమ్మతించాలని విజ్ఞప్తి చేసింది. శిరీష్‌తో నాకున్న స్నేహం పట్ల డాడ్ వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి లోనుచేసింది.

మా స్నేహాన్ని వదులుకోవాలని ఎంతో ఒత్తిడి తెచ్చారు. గృహనిర్భంధంలో ఉంచారు. మా కుటుంబంలోని ఎవరూ కూడా నాకు మద్దతు ఇవ్వలేదు. చివరికి మా అమ్మ కూడా అని శ్రీజ వ్యాఖ్యానించింది. నన్ను అర్థం చేసుకోవడంలో మా నాన్న విఫలమయ్యారు. నా నిజాయితీని, నమ్మకాన్ని నిరూపించుకునేందుకు కొంత సమయం నాకు కావాలని శ్రీజ అంటోంది.

వెబ్దునియా పై చదవండి