పి.వాసు దర్శకత్వంలో నాగార్జున, విష్ణు నటిస్తున్న చిత్రానికి "కృష్ణార్జున" అనే టైటిల్‌ను ఖరారు చేసారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్‌ను ప్రేక్షకులే ఎంపిక చేసినట్టు దర్శకుడు వాసు వెల్లడించారు. దీనిపై చిత్ర హీరోలలో ఒకరైన విష్ణు మాట్లాడుతూ.. ఈ చిత్రానికి "మిత్రమా" అనే టైటిల్‌ను ఎంపిక చేస్తారని అనుకున్నాం. అయితే.. ఎక్కువ మంది ప్రేక్షకులు "కృష్ణార్జున" అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
సరైన కథ లభించినట్టయితే.. "మిత్రమా" అనే టైటిల్‌తో చిత్రాన్ని చేస్తామన్నారు. ఈ చిత్రంలో నటించేందుకు అడిగిన వెంటనే నాగార్జున గారు అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక ఫాంటసీ చిత్రం. ఇందులో నేను సూపర్ హీరోగా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి వెండితెరపై చూసే హీరోలతో నిజ జీవితంలో కలసి నటించడం చాలా ఆనందంగా ఉందని విష్ణు అన్నాడు.
ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్ ఒక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం పాటలను త్వరలోనే విడుదల చేస్తామని, షూటింగ్ 90 శాతం మేరకు పూర్తయిందని దర్శకుడు వాసు వెల్లడించారు. కృష్ణార్జునులు ఎవరు? అసలు వారికి వీరికి ఏమిటి సంబంధం అనే సస్పెన్స్‌ను వీడేందుకు వచ్చే జనవరి లేదా ఫిబ్రవరి వరగు వేచి చూడాల్సిందేనని వాసు చెప్పారు.