కాంచన అందాలు ముందు నేటి తారల అందాలు సున్నా

మంగళవారం, 12 జులై 2011 (14:45 IST)
WD
నాటితరం నటీమణులు కాంచన, రాజసులోచన వంటివారి అభినయం, అందాల ముందు నేటితరం తారలు జీరోలని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వ్యాఖ్యానించారు. దాసరి శిష్యుడుగా పేరున్న మోహన్ బాబు ప్రస్తుత హీరోయిన్లను జీరోలతో పోల్చడంతో మరోసారి టాలీవుడ్‌లో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

మోహన్ బాబుకు చిత్తూరు నాగయ్య అవార్డు ప్రదానం కార్యక్రమం సోమవారం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడారు. నాటితరం నటీమణుల ప్రతిభను పొగుడుతూ నేటితరం హీరోయిన్లలో ఒకరిద్దరు తప్పించి మిగిలిన వారంతా పనికిరానివారని తేల్చి పారేశారు.

ఇదిలావుంటే ఇటీవల దాసరి నారాయణరావు టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒక్కరికి కూడా నటన చేతకాదనీ, అటువంటివారు హీరోలవడం మన ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. ఇపుడేమో మోహన్ బాబు హీరోయిన్లు జీరోలంటూ చెప్పుకొచ్చారు. అంటే.. ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకులు జీరోలు నటిస్తున్న సినిమాలను చూస్తున్నారన్నమాట.

వెబ్దునియా పై చదవండి