రాంగోపాల్ వర్మ ఒక సినిమా మొదలుపెట్టాడంటే అది ఆయన అనుకున్నట్లుగా చివరి దాకా తీసి చూపిస్తాడు. ఇదీ ఇప్పటి వరకూ ఆయనకున్న ఇమేజ్. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ కాస్త రివర్స్ అయినట్లుగా కనబడుతోంది.
నాగచైతన్య హీరోగా "బెజవాడ రౌడీలు" చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ బైటకు వచ్చిన దగ్గర్నుంచి బెజవాడ జనం వర్మపై చిందులు వేస్తూనే ఉన్నారు. కొంతమంది షూటింగులను అడ్డుకుంటే మరికొందరు కోర్టులకెళ్లారు. ఇలా వర్మను అన్ని కోణాల నుంచి గుక్క తిప్పుకోకుండా చేసేశారు.
మరి బెజవాడ జనం దెబ్బతోనో ఏమోగానీ బెజవాడ రౌడీలు పేరును కాస్త ఛేంజ్ చేసేసి బెజవాడగా మార్చేస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. మొత్తమ్మీద బెజవాడ జనం అంటే బెజవాడ జనమే.