వయసైపోయాక ఎక్స్‌పోజింగా?..మహిళా సంఘాల ఆగ్రహం

బుధవారం, 28 మార్చి 2012 (17:39 IST)
File
FILE
ఒకప్పుడు తెలుగు చిత్ర సీమలో హీరోయిన్‌గా వెలుగొందిన శ్రీదేవి, ప్రస్తుతం తన కుమార్తెను హీరోయిన్‌ని చెయ్యాలని తీవ్రంగా కృషి చేస్తోంది. పెద్ద కుమార్తె జాహ్నవిని మోడర్న్‌గా సిద్ధం చేసి తనతోపాటు ఫంక్షన్‌లకు తీసుకెళ్తోంది శ్రీదేవి. విచిత్రమేమిటంటే కుమార్తె కన్నా శ్రీదేవే సెక్సీ డ్రెస్‌లు వేసుకుంటోందట. ఈ మధ్య కూడా ముంబైలో జరిగిన ఒక ఫ్యాషన్ షోకి వయసులో ఉన్న ఆడపిల్లలు వేసుకునే దుస్తులు ధరించి వచ్చిందట శ్రీదేవి. ఇది అన్ని పత్రికలలోనూ వెలువడింది. ఈ విధంగా శ్రీదేవి ప్రవర్తించడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

"నటిగా ఉన్నంత వరకూ ఆమె దుస్తుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుతం ఆమె ఇద్దరు ఆడపిల్లల తల్లి. ఇంత వయసొచ్చిన తర్వాత కూడా సెక్సీగా దుస్తులు వేసుకుని పది మందిలో తిరగడం చాలా జుగుప్సాకరమైన విషయం. ఈ విషయం శ్రీదేవి‌కి ఎందుకు అర్థం కావడం లేదో తెలియడం లేదు అని ముంబై మహిళా సంఘాలు ఆమెను దుయ్యబడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి