22న రవితేజ, పూరి జగన్నాథ్‌ల 'దేవుడు చేసిన మనుషులు' ఆడియో

బుధవారం, 20 జూన్ 2012 (17:33 IST)
WD
మాస్‌ మహారాజా రవితేజ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ బేనర్‌పై భారీ చిత్రాల నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్‌ నిర్మిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ- ''ఇడియట్‌ చూసినప్పటి నుండి రవితేజ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఓ సూపర్‌హిట్‌ సినిమా చెయ్యాలన్న కోరిక నాలో కలిగింది. ఇన్నాళ్ళకు ఆ కోరిక నెరవేరుతున్నందుకు ఆనందంగా వుంది. హైదరాబాద్‌, బ్యాంకాక్‌, స్విట్జర్లాండ్‌లలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియోను ఈనెల 22న శిల్పకళావేదికలో విడుదల చేస్తున్నాం. రవితేజ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ని జూలై ద్వితీయార్థంలో భారీ ఎత్తున రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

మాస్‌ మహరాజ్‌ రవితేజ సరసన గ్లామర్‌స్టార్‌ ఇలియానా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్‌ వెంకట్‌, జ్యోతిరానా తదితరులు నటిస్తున్నారు. ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె. నాయుడు, ప్రొడక్షన్‌ డిజైనర్‌: చిన్నా, సంగీతం: రఘు కుంచె, పాటలు: భాస్కరభట్ల, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, డాన్స్‌: ప్రదీప్‌ ఆంథోని, దినేష్‌, స్టిల్స్‌: సాయి మాగంటి, కో-డైరెక్టర్‌: విజయరామ్‌ప్రసాద్‌, సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కో-ప్రొడ్యూసర్స్‌: భోగవల్లి బాపినీడు, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

వెబ్దునియా పై చదవండి