రాజమౌళి చిత్రంలో ఏ హీరో చేసినా అది హిట్టే. కానీ అందులో దర్శకుడి ప్రతిభే కన్పిస్తుంది. సహజంగా హీరోకు పేరు రాదు. ప్రభాస్‌తో 'ఛత్రపతి' సినిమా చేశాక... ఆ చిత్రానికి ప్రభాసే కరెక్ట్ అని అందరూ అన్నారు. మరే హీరో చేసినా అంత ఎఫెక్ట్ వచ్చేది కాదు. కానీ ఆ తర్వాత ప్రభాస్‌కు మరే సినిమా అంత రేంజ్‌లో హిట్ కాలేదు. కథ కూడా ఆయనకు దొరకలేదు. రాజమౌళి చిత్రంలో నటిస్తే... ఆ తర్వాత హిట్ కోసం నానా తంటాలు పడాల్సింది హీరోనేననే టాక్ ఇండస్ట్రీలో ఉంది. దీనికి రామ్ చరణ్, ఎన్.టి.ఆర్, సునీల్ వంటివారు కూడా ఉదాహరణలే.
అయితే.. ప్రభాస్ కోసం మలిచిన బహుబలి పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఆ పాత్రకు ప్రతినాయకునిగా ఉండే పాత్ర రానా పోషిస్తున్నాడు. ఇద్దరిమధ్య పోరాట సన్నివేశాలు నువ్వా నేనా అనేట్లుగా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతుంది. ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని తృణంగా పెట్టే బహుబలి పాత్ర ప్రభాస్‌ది.
అలాంటి మాట కోసం ప్రతినాయకుడు కాపు కోసం కూర్చునట్లు కూర్చుని... ప్రజల చేత ప్రాణాల్ని ఇచ్చేలా చేస్తాడట. చాలా ట్విస్టులతో కూడిన ఈ కథను రాజమౌళి ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారని చిత్ర యూనిట్ అంటోంది.