యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, రానా ప్రతినాయకుడిగా అందాలభామ అనుష్క హీరోయిన్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న సినిమా 'బహుబలి'. ఈ సినిమా జులై 6 నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ మూవీ కోసం 'బహుబలి' చిత్ర యూనిట్ చాలా కష్టబడుతుంది. చారిత్రక నేపధ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో అసలైన స్టోరి ఎంత, సోది ఎంత అనే విషయాలపై ఇప్పుడు సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.
సినిమా మొత్తాన్ని రాజమౌళి కత్తులు, యుద్దాలతో నడపడంలేదట. ఇందులో ఓ 70 నిముషాల పాటు రక్తి కట్టించే నేపధ్య కథాంశం ఉంటుంది. మిగతా స్టోరి అంతా తనదైన స్టైల్‌లో లాంగేంచేస్తాడట రాజమౌళి. అయితే ఈ 70 నిముషాల పవర్‌పుల్ స్టోరిను ఎంటైర్ మూవీ ఎండింగ్ వరకూ ఎమోషనల్‌గా కంటిన్యూ చేస్తాడని చిత్ర యూనిట్ నుండి విశ్వశనీయ వర్గాల సమాచారం.