'ఎవడు'కు సీమాంధ్రలో... 'రామయ్య'కు తెలంగాణలో బ్రేకులు... దిల్ రాజు కుదేల్!

సోమవారం, 19 ఆగస్టు 2013 (13:13 IST)
FILE
సమైక్యాంధ్రకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేక వాదినని, తాను కూడా ప్రజలతో మమేకమై ఉద్యోమంలో పాల్గొంటానని హరికృష్ణ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ప్రభావం టీడీపీపై ఎలా ఉన్నా ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' సినిమాపై పడే అవకాశం ఉంది.

జూ.ఎన్టీఆర్ హీరోగా సమంత, శృతిహాసన్ హీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల చేయటానికి నిర్మాత దిల్ రాజు నిర్ణయించారు.

అయితే తాజాగా హరికృష్ణ బహిరంగ లేఖతో ఈ సినిమాకు బ్రేకులు పడే ఆస్కారం ఉంది. హరికృష్ణ సమైక్యాంధ్రాకు మద్దతు తెలపడంతో తెలంగాణ ప్రాంతంలో ఈ సినిమా విడుదలకు బ్రేకులు పడేటట్లు ఉన్నాయి. ముఖ్యంగా దిల్ రాజుకు నైజాం ఎరియాలో ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. ఇప్పటికే నైజాం ప్రాంతంలో భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు దిల్ రాజు.

తాజా పరిస్థితుల్లో ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' తెలంగాణలో విడుదలవ్వడం అనుమానమే. చిరంజీవి వైఖరి కారణంగా రామ్ చరణ్ 'ఎవడు' రిలీజ్ కాకుండా మూలనపడిపోయింది. తాజాగా రామయ్యా వస్తావయ్యా కూడా రిలీజ్ కాకపోతే దిల్ రాజు కుదేలవ్వడం ఖాయం.

వెబ్దునియా పై చదవండి